తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు!

తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో 13.1 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదైంది. నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడాపూర్‌లో 4.7, నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో 4.4, సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలో 4.2 సెం.మీ. కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండిలో 13 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదు కాగా, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో 12.2 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదైంది.

Tags:

తాజా వార్తలు

ఏపీలో రేషన్ పంపిణీపై కీలక నిర్ణయం ఏపీలో రేషన్ పంపిణీపై కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ పంపిణీపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్‌డియు (మొబైల్ డిస్‌పెన్సింగ్ యూనిట్) వాహన నిర్వాహకులు గత పరిపాలనలో...
ఆ ఒక్క రోజు దర్శన సమయం మార్పు
రూ.60వేల కోట్లతో భారీ ప్రాజెక్ట్
సీతారామన్‌తో చంద్రబాబు భేటీ
పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు: ఓఆర్‌ఆర్‌ అబ్దుల్లాపూర్‌మెట్‌
నిరుద్యోగ యువత నిరసనతో టీజీపీఎస్సీ కార్యాలయాన్ని పటిష్టం
హైదరాబాద్ సెయిలింగ్ వీక్‌లో రితికకు డబుల్ డిలైట్