హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్!

హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. చిరంజీవిని కలిసి పలు అంశాలపై చర్చించారు. దీనిపై బండి సంజయ్ సోషల్ మీడియాలో స్పందించారు. 

'నా మెగాస్టార్‌ అన్న చిరంజీవిని కలవడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. చిరంజీవి నిరాడంబరమైన వ్యక్తి, నా శ్రేయోభిలాషి. కాలేజీ రోజుల నుంచి ఆయన సినిమాలకు నేను అభిమానిని అని ట్వీట్ చేశాడు. బండి సంజయ్ చిరంజీవిని కలిసిన చిత్రాలను కూడా పంచుకున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కేంద్రం నుంచి పద్మవిభూషణ్ అందుకున్న సంగతి తెలిసిందే. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన ఆయన... అధికారికంగా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్టు ఇంకా ప్రకటించకపోవడమే ఇందుకు కారణం. 

అయితే ఆయనకు రాజ్యసభలో అవకాశం ఇవ్వాలని కేంద్రం పెద్దలు ఆలోచిస్తున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చిరంజీవితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా చిరంజీవి వద్దకు వెళ్లి ఏపీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.

Tags:

Related Posts

తాజా వార్తలు

బెంగళూరులో విషాదం క్రికెట్ బ్యాట్ తో కొడుకును కొట్టిచంపిన తండ్రి.. బెంగళూరులో విషాదం క్రికెట్ బ్యాట్ తో కొడుకును కొట్టిచంపిన తండ్రి..
  పాఠశాలకు సరిగా వెళ్లడంలేదని  ఆగ్రహించిన తండ్రి సెల్‌ఫోన్ రిపేర్‌కు డబ్బులు ఇవ్వాలని కొడుకు అడగడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.చదువుకుని గొప్పవాడివి కావాలని మేం కష్టపడి నిన్ను
ఒమర్ అబ్దుల్లా J&K ముఖ్యమంత్రిగా, సురీందర్ చౌదరి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
కేవలం 1,000 స్పాట్‌లతో ఆస్ట్రేలియా వర్క్ మరియు హాలిడే వీసా కోసం 40,000 మంది భారతీయులు దరఖాస్తు చేసుకున్నారు
హర్యానాలోని ఫార్మాస్యూటికల్ సంస్థ ఉద్యోగులకు 15 కార్లను బహుమతిగా ఇచ్చింది
ఇజ్రాయెల్ చూపిన గదులు, ఆయుధాలు మరియు వాహనాలతో కూడిన సొరంగం
బాంబు బెదిరింపు కారణంగా కెనడాకు దారి మళ్లించిన ఎయిర్ ఇండియా విమానం చికాగోకు మళ్లించబడింది
జైపూర్ డైరీ: పర్యాటక అవకాశం కోసం పెట్టుబడి సదస్సు