జాబ్‌ క్యాలెండర్‌ ఏది?.. కాంగ్రెస్‌ను నిలదీసిన కిషన్‌రెడ్డి

జాబ్‌ క్యాలెండర్‌ ఏది?.. కాంగ్రెస్‌ను నిలదీసిన కిషన్‌రెడ్డి

అధికారంలోకి రాగానే ఉద్యోగాల క్యాలెండర్‌ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ఇప్పుడు మరిచిపోయిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు హామీల అమలుకు హామీ ఇవ్వలేదని విమర్శించారు. శనివారం బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ టీజీపీఎస్సీ ఎదుట ధర్నాకు దిగిన బీజేవైఎం నేతలపై పోలీసుల దాడిని కిషన్ రెడ్డి ఖండించారు.

సింగరేణ కార్మికుల బాగోగులను కేంద్రం పట్టించుకుంటుందని స్పష్టం చేశారు. సింగరేణి ప్రైవేటీకరణ పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు బొగ్గు గనుల వేలం అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, 107 బొగ్గు గనుల వేలం ద్వారా భారీగా ఆదాయం సమకూరిందని వివరించారు. బొగ్గు గనుల వేలం ద్వారా వచ్చిన సొమ్ములో కేంద్రం ఒక్క పైసా తీసుకోదని, కేవలం కార్మికుల సంక్షేమం కోసమే కేంద్రం ఖర్చు చేస్తుందని కిషన్ రెడ్డి అన్నారు.

Tags:

తాజా వార్తలు

2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా  2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా
యూఎస్‌ఏ, వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు విజయాన్ని అందించిన తర్వాత ఇటీవలే టీ20ల నుంచి రిటైరయిన రోహిత్ శర్మ వచ్చే ఏడాది జరగబోయే రెండు ముఖ్యమైన...
నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలు, ముగింపు ఫ్లాట్; మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్, FMCG పతనం
శ్రీలంక LPG కంపెనీ మరియు టెర్మినల్ కోసం ఎనిమిది మంది బిడ్డర్లలో భారత్ పెట్రోలియం
భారతదేశంలో కొత్త కొడియాక్, ఆక్టేవియాను పరిచయం చేయడానికి స్కోడా సిద్ధమైంది
IRFC, RVNL మరియు IRCTC వంటి రైల్వే స్టాక్‌లు నేడు ఎందుకు లాభపడుతున్నాయి??
ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వీపీ హేమంత లాంబా రాజీనామా
'మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తాం': వినియోగదారులు గ్లిచ్ తర్వాత జెరోధాను